కామెడీలో టాలెంట్ చూపనున్న రామ్ చరణ్

Ram-Charan
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తన కెరీర్లో తొలిసారిగా ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్లతో కలిసి పని చేయడానికి రెడీ అవుతున్నారు. శ్రీనువైట్ల ఎందుకు ప్రసిద్దో ప్రతి ఒక్కరికి తెలుసు.

చరణ్ కూడా తన కెరీర్లో మొదటి సారి పూర్తి స్థాయి కామెడీ సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. చాలా ఆసక్తిగా ఈ సినిమా గురించి ఎదురుచూస్తున్నాడు. తన కెరీర్లో ఈ సినిమా కాస్త వైవిధ్యంగా ఉంటుంది.

గోపి మోహన్ మరియు కోన వెంకట్ ఈ సినిమాకు స్క్రిప్ట్ అందిస్తున్నారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. చరణ్ ఎలాంటి వైవిధ్యం చూపిస్తారో.. వేచి చూడండి.

Exit mobile version