ఐటమ్ సాంగ్స్‌కి నో అంటోన్న రెజీనా

regins
రెజీనా.. ఇప్పుడున్న హీరోయిన్లలో మిడిల్ బడ్జెట్ సినిమాలకు స్టార్. చిన్న సినిమాలతోనే తన అందం, నటన ద్వారా మంచి పేరు తెచ్చుకుంది రెజీనా. తాజాగా ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న రెజీనా.. ఐటమ్ సాంగ్స్‌లో నటించడంపై తన అభిప్రాయాలను పంచుకుంది. తనకు ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ చేయాల్సిన అవసరం లేదని, హీరోయిన్‌గా తనకు చక్కటి అవకాశాలున్నాయని అంది. పెద్ద పెద్ద హీరోయిన్లు సైతం తమ కెరీర్ మంచి దశలో ఉన్నపుడు కూడా ఐటమ్ నెంబర్స్ చేస్తున్నారు కదా ? అన్న ప్రశ్నకు తనకు మాత్రం ఇప్పట్లో ఐటమ్ సాంగ్స్ చేసే ఉద్దేశం లేదని తెల్చేసింది.

ఇక ‘పిల్లా.. నువ్వులేని జీవితం’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన మెగా కాంపౌండ్ హీరో సాయిధరమ్ తేజ్ తాజా సినిమాలోనూ రెజీనాయే హీరోయిన్. వీరిద్దరూ కలిసి నటించిన ‘పిల్లా.. నువ్వులేని జీవితం’ ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ అదే జోడీ తెరపై కనిపించనుంది. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.

Exit mobile version