కాకతీయుల వరంగల్ ఫోర్ట్ లో ‘రుద్రమదేవి’ ఆడియో రిలీజ్

rudhramadevi

ఓరుగల్లు ఘనతను భారతదేశ దశదిశలా చాటి చెప్పిన కాకతీయ వీరనారి రాణి రుద్రమదేవి జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న చారిత్రాత్మక సినిమా ‘రుద్రమదేవి’. భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్ దాదాపు 9 సంవత్సరాలు రీసర్చ్ చేసి తెరకెక్కించిన ఈ పీరియాడికల్ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. కాకతీయ వీరనారి రుద్రమదేవి కథ కావడంతో ఈ చిత్ర టీం ఈ సినిమా ఆడియోని ఓరుగల్లు ఘనతకు చిహ్నంగా ఉన్న వరంగల్ ఫోర్ట్ లో రిలీజ్ చేయడానికి నిర్ణయించుకున్నారు. అలాగే ఈ ఆడియో లాంచ్ కార్యక్రమానికి ఏప్రిల్ 8వ తేదీని పరిశీలిస్తున్నారు.

విశ్వసనీయ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం ఏప్రిల్ 8నే ఆడియోని వరంగల్ ఫోర్ట్ లో రిలీజ్ చేయనున్నారని, దానికి సంబందించిన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని అంటున్నారు. ఇటీవలే రిలీజ్ చేసిన ఈ చిత్ర టైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇండియాలోనే మొట్టమొదటి సారిగా గుణశేఖర్ స్టీరియో స్కోపిక్ ద్వారా తెరకెక్కిస్తున్న హిస్టారికల్ 3డి మూవీ ‘రుద్రమదేవి’. అనుష్క, రానా ప్రధాన పాత్రలు నటించిన ఈ సినిమాలో అల్లు అర్జున్, కృష్ణం రాజు, నిత్య మీనన్, కేథరిన్, హంసా నందిని, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి తోట తరణి ఆర్ట్ డైరెక్టర్.

Exit mobile version