
అక్కినేని ఫ్యామిలీ నవతరం వారసుడు అక్కినేని అఖిల్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా షూటింగ్ ఇటీవలే హైదరబాద్ లో మొదలవ్వడమే కాకుండా కంటిన్యూగా షూటింగ్ కూడా జరుపు కుంటోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ఈ నెల 17 నుంచి మొదలైంది. ప్రస్తుతం ఈ షెడ్యూల్ లో భాగంగా రామోజీ ఫిల్మ్ సిటీలో కొన్ని ముఖ్య సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఈ షూటింగ్ లో అఖిల్ తో పాటు హీరోయిన్ సయేష సైగల్ కూడా పాల్గొంటోంది.
వివి వినాయక్ సినిమా షెడ్యూల్స్ లో ఏ మాత్రం గ్యాప్ లేకుండా చాలా వేగంగా షూటింగ్ ఫినిష్ చేస్తున్నాడు. అఖిల్ ఫాదర్ పాత్రలో రాజేంద్ర ప్రసాద్ కనిపించనున్న ఈ సినిమాలో రాశి ఖన్నా ఓ స్పెషల్ సాంగ్ చేయనుంది. శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై యంగ్ హీరో నితిన్ నిర్మించనున్న ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ – అనూప్ రూబెన్స్ కలిసి సంగీతం అందిస్తున్నాడు. వెలిగొండ శ్రీనివాస్ కథని అందించిన ఈ సినిమాకి కోన వెంకట్ డైలాగ్స్ అందిస్తున్నాడు.