
ఎనర్జిటిక్ హీరో రామ్ – టాలీవుడ్ గోల్డెన్ లెగ్ రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న సినిమా ‘పండగ చేస్కో’. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు సోనాల్ చౌహాన్ కూడా మరో హీరోయిన్ గా కనిపిస్తోంది. గత కొద్ది రోజులుగా ఈ సినిమా షెడ్యూల్ పోర్చుగల్ లో జరుగుతోంది. ఈ షెడ్యూల్ పూర్తయ్యింది. ఈ పోర్చుగల్ షెడ్యూల్లో రకుల్ ప్రీత్ సింగ్, సోనాల్ చౌహాన్ లపై ఓ చెరో పాటని షూట్ చేయడమే కాకుండా కొన్ని కీలక సన్నివేశాలను కూడా షూట్ చేసారు.
దీంతో ఈ సినిమాలోని మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తయ్యింది. ఇక బాలన్స్ ఉన్న పార్ట్ ని ఒక్క షెడ్యూల్ లో ఫినిష్ చేయనున్నారు. అమెరికా నుండి ఇండియా వచ్చిన స్టైలిష్ ఎన్నారై యువకుడి పాత్రలో రామ్ కనిపించనున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. త్వరలోనే ఆడియో రిలీజ్ చేసి ఏప్రిల్ లో ఈ సినిమాని రిలీజ్ చేసేలా ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తోంది. యునైటెడ్ మూవీస్ పతాకంఫై పరుచూరి ప్రసాద్ సమర్పణలో పరుచూరి కిరీటి ‘పండగ చేస్కో’ను నిర్మిస్తున్నారు.