‘ఎర్రగులాబీలు’ కొత్త వర్షన్‌లో శ్రీదేవి?

sridevi (1)
విలక్షణమైన నేపాథ్యాలు, భిన్నమైన కథాంశాలు, వాస్తవికతకు దగ్గరగా ఉండే ప్రపంచం.. భారతీరాజా సినీ ప్రపంచానికి అందించిన అద్భుతాలు. ఆ అద్భుతాల్లో ఒకటే ‘సిగప్పు రాజక్కల్’. కమల్ హాసన్, శ్రీదేవి జంటగా నటించిన ఈ సినిమా 1978లో విడుదలై సంచలన విజయం సాధించింది. ఇదే సినిమాను ఎర్రగులాబీలు పేరుతో తెలుగులో అనువదించారు. ఒకేరకమైన సినిమాలు విడుదలవుతున్న తరుణంలో థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా సంచలనం సృష్టిస్తుంది. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ లాంటిదే ఒకటి తెరకెక్కుతోంది.

భారతీ రాజా తనయుడు మనోజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఎర్ర గులాబీలు సినిమా చూసిన ఒక వ్యక్తి ఆ సినిమాపై ఎలా రియాక్ట్ అయ్యాడనే వినూత్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ మొదలైపోయిన ఈ సినిమాలో శ్రీదేవి ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో విశాఖన్ అనే కొత్త వ్యక్తి హీరోగా పరిచయం కానున్నాడు. భారతీరాజా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తుండడం విశేషం.

Exit mobile version