త్రివిక్రమ్ ని ట్రై చేస్తున్న సూర్య.!

trivikram-with-suriya
తమిళంలో స్టార్ ఇమేజ్ ఉన్న హీరో సూర్య.. సూర్యకి తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా స్టార్ ఇమేజ్ ఉంది అంతే కాకుండా స్ట్రాంగ్ మార్కెట్ కూడా ఉంది. అందుకే తన సినిమాలన్నీ తెలుగులో కూడా రిలీజ్ అవుతుంటాయి. కానీ సూర్య ఇంకా డైరెక్ట్ తెలుగు సినిమా చేయలేదు. సూర్య చివరి సినిమా సికందర్ టైంలో కథ ఓకే అయ్యిందని, తెలుగులో డైరెక్ట్ సినిమా త్వరలోనే చెయ్యనున్నాని తెలిపాడు. కానీ ఆ తర్వాత ఆ సినిమా గురించిన వివరాలు బయటకి రాలేదు.

సూర్య తెలుగు సినిమాని స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజ నిర్మించనున్నాడు. ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న లేటెస్ట్ న్యూస్ ప్రకారం జ్ఞానవేల్ రాజ సూర్య తొలి డైరెక్ట్ తెలుగు సినిమా కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ ని అప్రోచ్ అయ్యాడట. ఈ విషయంపై ఇరువురి మధ్య చర్చలు కూడా జరిగాయని సమాచారం. ఈ విషయంపై త్రివిక్రమ్ సానుకూలంగానే స్పందించినట్టు సమాచారం. కానీ ఇవి ఇంకా చర్చల దశలోనే ఉన్నాయి. అన్నీ ఫైనలైజ్ అయ్యి ఈ సినిమా కార్యరూపం దాలుస్తుందా.? లేక.? ఆగిపోతుందా.? అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం ‘S/O సత్యమూర్తి’ రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. అలాగే సూర్య ‘మాస్’ సినిమాని ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నాడు.

Exit mobile version