
మాస్ మహారాజ రవితేజ కెరీర్లో కమర్షియల్ గా పెద్ద హిట్ అవ్వడమే కాకుండా తన కెరీర్ కి బిగ్గెస్ట్ బూస్టప్ ఇచ్చిన సినిమా ‘కిక్’. రవితేజ బాడీ లాంగ్వెన్ కి, అతని ఎనర్జీ లెవల్స్ కి పర్ఫెక్ట్ గా సరిపోయే పాత్రని కిక్ లో చేసాడు. ఇప్పుడే అదే లెవల్ ఎనర్జీ ఉన్న పాత్రలో మరోసారి రవితేజ కనిపించనున్న సినిమా ‘కిక్ 2’. కిక్ సినిమాకి కొనసాగింపుగా ఆ పార్ట్ లోని రవితేజ – ఇలియానాల వారసుడి కథని ఆధారం చేసుకొని ‘కిక్ 2’ సినిమాని చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ప్రస్తుతం ఈ చిత్ర టీం రవితేజ – రకుల్ ప్రీత్ సింగ్ లపై వచ్చే రొమాంటిక్ సాంగ్స్ ని స్విట్జర్లాండ్ లో షూట్ చేస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్ లో ఓ మేజర్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర టీం స్విస్ లోని బ్యూటిఫుల్ లోకేషన్స్ లో సాంగ్ షూటింగ్ చేస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాని నందమూరి కళ్యాణ్ రామ్ ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. కిక్ సినిమాలనే ఈ సినిమాలో కూడా ఆద్యంతం ఎంటర్టైన్మెంట్ ఉంటూనే థ్రిల్ చేసే అంశాలు కూడా ఉంటాయని సమాచారం. మేలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.