
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నేడు 30వ పుట్టినరోజు జరుపుకున్నాడు. ఈ జన్మదిన వేడుకలు ఇంటివాళ్ళ సమక్షంలో జరుపుకున్నాడు. చరణ్ ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా తరువాత ఇంటి సమక్షంలోనే ఎక్కువ గడుపుతున్నాడు. చరణ్ తో శ్రీను వైట్ల సినిమా త్వరలో మొదలుకానుంది.
చెర్రి గత చిత్రానికి మిశ్రమ స్పందన రావడంతో చాలా కాలం విరామం తరువాత శీను చిత్రాన్ని అంగీకరించిన విషయం తెలిసినదే. ఈ ప్రాజెక్ట్ కోసం కోనా వెంకట్, గోపీ మోహన్ లను శీనుతో కలిపాడు. సినిమాలో చరణ్ పాత్ర ప్రదానకార్షణగా నిలుస్తుందని సమాచారం.
ఈ సినిమాకు ఇంకా టైటిల్ ని ఖరారు చెయ్యలేదు. ఏప్రిల్ 2 నుండి షూటింగ్ ప్రారంభంకానుంది. రాకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. డి.వి.వి దానయ్య నిర్మాత