త్రిష ద్విభాషా చిత్రానికి తెలుగు టైటిల్ ఖరారు

Trisha
తన నిశ్చితార్ధం తరువాత తిరిగి చేతిలో వున్న ప్రాజెక్ట్ లలో తిరిగి బిజీగా మారింది. అందులో ఒకటి తెలుగు, తమిళ భాషలలో విడుదలకానున్న ప్రాజెక్ట్ వుండడం విశేషం. ఈ సినిమాకు తమిళంలో ‘భోగి’ అనే టైటిల్ ని ఖరారు చేసారు. త్రిష, పూనమ్ భాజ్వ, ఓవియా లు స్నేహితురాళ్ళగా నటిస్తూ మనకు ఆద్యంతం వినోదాన్ని అందించడానికి సిద్ధపడుతున్నారు.

ఈ సినిమాకు తెలుగులో ‘మేము’ అనే టైటిల్ ని ఖరారు చేసినట్టు త్రిష సోషల్ నెట్వర్కింగ్ ద్వారా తెలిపింది. పాండ్యన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను చెన్నై, హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుతున్నారు. ఇటీవలే త్రిష ‘లయన్’ సినిమాలో తన పాత్రను పూర్తిచేసుకుంది. వేసవిలో ఈ సినిమా మనముందుకు రానుంది.

Exit mobile version