అఖిల్ కోసం అన్నీ చూడనివే సెలక్ట్ చేస్తున్నారట.!

akhil1
అక్కినేని ఫ్యామిలీ హాన్డ్సం హీరో అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న మొదటి సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఏప్రిల్ 22 నుండి ఈ సినిమా కొన్ని సాంగ్స్ షూటింగ్ కోసం అబ్రాడ్ వెళ్లనున్నారు. ఆక్కడి నుంచి తిరిగి వచ్చాక హైదరాబాద్ లో మరో సాంగ్ ని షూట్ చేస్తారు. ఇక్కడ విశేషం ఏమిటంటే అఖిల్ సినిమా కోసం ఈ చిత్ర టీం మునుపెన్నడూ షూట్ చేయని లొకేషన్స్ ని సెలెక్ట్ చేస్తోంది. విజువల్స్ ఆడియన్స్ ని థ్రిల్ చేసేలా ఉండాలని వినాయక్ – నితిన్ లు స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు.

అబ్రాడ్ షెడ్యూల్ లో భాగంగా స్పెయిన్ లోనే కాకుండా ఆఫ్రికా దేశం లోని యుగాండలో కూడా సాంగ్స్ ని షూట్ చేయనున్నారు. యుగాండ లో షూట్ చేస్తున్న ఫస్ట్ తెలుగు సినిమా అఖిల్ దే కావడం విశేషం. ఎప్పటికప్పుడు మిలిటెంట్ అటాక్స్ తో దద్దరిల్లే ప్రదేశం యుగాండ. ఇలాంటి పరిస్థితులను కూడా లెక్క చేయకుండా అఖిల్ టీం తెలుగు ప్రేక్షకులకు కొత్త లొకేషన్స్ తో ప్రేక్షకులకు థ్రిల్ ఇవ్వాలని అక్కడ ఓ షెడ్యూల్ ప్లాన్ చేసారు. ఈ మొత్తం అబ్రాడ్ షెడ్యూల్ కంటిన్యూగా 35 రోజులు జరగనుంది. అనగా జూన్ లో మళ్ళీ ఈ చిత్ర టీం ఇండియాకి తిరిగి వస్తారు.

ఇది కాకుండా అఖిల్ బర్త్ డే కానుకగా రిలీజ్ చేసిన మేకింగ్ టీజర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది ముఖ్యంగా అఖిల్ చూపిన మానరిజమ్స్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అఖిల్ సరసన సయేశా సైగల్ హీరోయిన్ గా నటిస్తుండగా వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడు. నితిన్ నిర్మిస్తున్న ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ కి అనూప్ రూబెన్స్ – తమన్ కలిసి మ్యూజిక్ ని అందిస్తున్నారు.

Exit mobile version