
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ సినిమాలు చేయడంలో తన దూకుడును పెంచాడు. ఇప్పటికే ‘పండగ చేస్కో’ సినిమా షూటింగ్ ఫినిష్ చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. ఇది కాకుండా శ్రీనివాస్ రెడ్డి డైరెక్షన్ లో చేస్తున్న తన తదుపరి సినిమా ‘శివం’కి రెండు షెడ్యూల్స్ పూర్తి చేసాడు. అంతే కాకుండా మార్చి 31 నుంచి ‘హరికథ’ సినిమా షూటింగ్ ని మొదలు పెట్టాడు. మార్చి 31 నుంచి కంటిన్యూగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.
ప్రస్తుతం హరికథ సినిమా షూటింగ్ పొల్లాచ్చిలోని హాట్ హాట్ లొకేషన్స్ లో జరుగుతోంది. ప్రస్తుతం రామ్, కీర్తి సురేష్, సీనియర్ నరేష్, ప్రగతిలపై కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. అక్కడ ఎండ ఎక్కువగా ఉన్నా షూటింగ్ మాత్రం చాలా కూల్ కూల్ గా జరుగుతోందని ఈ చిత్ర టీం అంటున్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని స్రవంతి మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్నాడు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి పీటర్ హెయిన్స్ ఫైట్ మాస్టర్.
రామ్ – రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన ‘పండగ చేస్కో’ సినిమాని మే లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.