‘ఓకే బంగారం’.. ‘సఖి’ అంత పెద్ద హిట్ అవుతుంది!

ok-bangaram
దర్శకుడు మణిరత్నం ఎంతో శ్రద్ధగా తెరకెక్కించిన అందమైన ప్రేమకథ ‘ఓకే కన్మణి’ (ఓకే బంగారం). గత కొంతకాలంగా తన మార్క్ సినిమాని తీయలేకపోయిన మణిరత్నం ఈ సారి మాత్రం అభిమానులను నిరాశపరచడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్ టీజర్స్ చూసిన ప్రతి ఒక్కరూ ‘మణిరత్నం ఈజ్ బ్యాక్’ అంటున్నారు. ఈ సినిమాను ‘ఓకే బంగారం’ పేరుతో తెలుగులో ప్రముఖ నిర్మాత దిల్‌రాజు విడుదల చేస్తున్నారు.

ఈ నెల 17న తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో భారీ ఎత్తున ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా హైద్రాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దిల్ రాజు మాట్లాడారు. “తెలుగు సినిమాల్లో ఇంతవరకూ రాని కొత్త కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. సహజీవనం నేపథ్యంలో నడిచే అందమైన ప్రేమకథే ఈ సినిమా. సఖి అంత పెద్ద హిట్ అవుతుందని నమ్మకంగా ఉంది” అని అన్నారు. దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు ఏ.ఆర్.రెహమాన్ సంగీత దర్శకుడు.

Exit mobile version