
సినిమా ఇండస్ట్రీలోకి కొంతమంది హీరోలవ్వాలని వచ్చి డైరెక్టర్స్ అవ్వడం, అలాగే డైరెక్టర్స్ అవ్వాలని వచ్చి హీరోలుగా మారిన వారు, కమెడియన్స్ అయిన వారు చాలా మంది అన్నారు. ప్రస్తుతం యంగ్ హీరోస్ లో ఫుల్ క్రేజ్ ఉన్న హీరోలలో నాని ఒకరు. నాని ముందుగా డైరెక్టర్ అవ్వాలని వచ్చాడు, కానీ అనుకోకుండా హీరో అయిపోయాడు. డిఫరెంట్ సినిమాలను కమర్షియల్ ఫార్మాట్ లో తీస్తూ విజయాలను అందుకుంటున్నాడు నాని.
నాని నటించిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘జెండాపై కపిరాజు’ సినిమాలు ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈ రెండు విజయాలతో మంచి ఉత్సాహంగా ఉన్న నాని ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా సెట్స్ పైకి వెళ్ళక ముందు మంచి స్క్రిప్ట్ దొరకకపోవడంతో తనే డైరెక్టర్ అవ్వాలనుకున్నాడట. ‘ఎవడే సుబ్రహ్మణ్యం స్క్రిప్ట్ ఫైనలైజ్ చెయ్యక ముందు సుమారు 80 కథలు విన్నాను. ఆ టైంలో ఒక్క మంచి స్క్రిప్ట్ కూడా డీసెంట్ గా అనిపించకపోవడంతో నేనే ఓ ఓన్ కథ రాసుకొని, స్వంతంగా డైరెక్ట్ చేయాలనుకున్నాను. కానీ అప్పట్లో నా ఫ్రెండ్స్ దానిని వ్యతిరేఖించారని’ అన్నాడు.
నాని ప్రస్తుతం మారుతి డైరెక్షన్ లో ‘భలే భలే మగాడివోయ్’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.లావణ్య త్రిపాటి హీరోయిన్ గా నటిస్తోంది.