మలేషియాలో మహేష్ ‘శ్రీ మంతుడు’

Mahesh-babu
సూపర్ స్టార్ మహేష్ బాబు – ‘మిర్చి’ ఫేం కొరటాల శివ కాంబినేషన్ లో రానున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కి ‘శ్రీమంతుడు’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్ లో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్ లో భాగంగా రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేసారు. హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి కాగానే ఈ చిత్ర టీం మలేషియా షిఫ్ట్ అయ్యింది. ప్రస్తుతం మలేషియాలో సినిమాకి కీలకం అయిన ఓ ఎపిసోడ్ ని షూట్ చేస్తున్నారు.

ఈ మలేషియా షెడ్యూల్ లో మహేష్ బాబు, శృతి హాసన్, జగపతి బాబు తదితరులు పాల్గొంటున్నారు. ఈ మలేషియా షెడ్యూల్ ఏప్రిల్ 22 వరకూ జరగనుంది. ఆ తర్వాత షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలవుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ఆకట్టునే ఈ కథలో యువతకు నచ్చే కామెడీ, యాక్షన్, లవ్ లాంటి అంశాలను కూడా కొరటాల శివ పుష్కలంగా పొందు పరిచారని ఈ చిత్ర టీం అంటోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, రాహుల్ రవీంద్రన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మహేష్ బాబుతో మొదటి సారి శృతి హాసన్ జోడీ కట్టిన ఈ సినిమాని జూలై 17న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version