
టాలీవుడ్ లో ఉన్న ఆరడుగుల ఆజానుబాహుల్లో యంగ్ హీరో రానా ఒకరు. ఈ మాచో హీరో రీసెంట్ గా హైదరాబాద్ టైమ్స్ నిర్వహించిన సర్వేలో 2014 మోస్ట్ డిజైరబుల్ మాన్ గా ఎంపికయ్యాడు. స్టార్ హీరోలందరినీ దాటి రానా ఈ రేర్ ఫీట్ సాధించాడు. హైదరాబాద్ టైమ్స్ నిర్వహించిన ఈ సర్వేలో రానా అతోప్ ప్లేస్ కొట్టేస్తే ఆ తర్వాతి స్థానాలను మహేష్ బాబు, ప్రభాస్, నితిన్, ఎన్.టి.ఆర్, అఖిల్ లు దక్కించుకున్నారు.
ప్రస్తుతం రానా కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటించాడు. ప్రస్తుతం ఈ సినిమా విదుఅల కోసం వెయిట్ చెయ్యడమే కాకుండా మరి కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ కి సైన్ చేస్తున్నాడు. రానా నటించిన భారీ బడ్జెట్ చిత్రాలు రుద్రమదేవి, బాహుబలి సినిమాలు విడుదలకు సిద్దమవుతున్నాయి. ఈ రెండు సినిమాలు రానా కెరీర్ ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని ఆశిస్తున్నాడు. ఇది కాకుండా రానా ప్రస్తుతం తమిళ బెంగుళూరు డేస్ రీమేక్ లో నటిస్తున్నాడు. ఇది కాకుండా పలు సినిమాలను త్వరలో సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నాడు.