
ఇద్దరు సూపర్ స్టార్స్.. వీరిద్దరి కాంబినేషన్ లో రెండు సూపర్ హిట్స్.. మళ్ళీవీరి కాంబినేషన్ లో సినిమా అంటే అభిమానులకు పెద్ద పండుగనే చెప్పాలి.. ఇంతీ ఎవరా స్టార్స్ అంటారా.? టాలీవుడ్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు, అలాగే హీరోయిన్స్ లో సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరోయిన్ సమంత. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘దూకుడు’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలు ఆడియన్స్ ని భీభత్సంగా ఎంటర్టైన్ చేసాయి. ఇదే కాంబినేషన్ లో మరో సినిమా ఉండనుందా.? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు.
మహేష్ బాబు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే మహేష్ బాబు శ్రీ కాంత్ అడ్డాల డైరెక్షన్ లో ‘బ్రహ్మోత్సవం’ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో కథా పరంగా ముగ్గురు హీరోయిన్స్ కి ఆస్కారం ఉందని సమాచారం. అందులో మెయిల్ లీడ్ కోసం సమంతని ఎంపిక చేసే పనిలో ఉన్నట్లు సమాచారం. మిగతా పాత్రల కోసం కూడా పలువురు స్టార్ హీరోయిన్స్ ని చూస్తున్నట్లు సమాచారం. శరవేగంగా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా మే చివర్లో మొదలు కానుంది.