
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా షూటింగ్ లో బిజీబిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంటోంది. ఇది కాకుండా తన తదుపరి సినిమాగా శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో ‘బ్రహ్మోత్సవం’ సినిమా చేయనున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కథానుసారం మహేష్ బాబు సరసన ముగ్గురు హీరోయిన్స్ కి నటించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ ముగ్గురిని సెలక్ట్ చేసారు కానీ ఫైనలైజ్ చెయ్యలేదు.
ఇంతకీ ఆ ముగ్గురు హీరోయిన్స్ ఎవరు అంటే.. సమంత, తాప్సీ మరియు ప్రణిత. ఈ రోజు మహేష్ బాబు, సమంత, తాప్సీ, ప్రణితలపై ఓ స్పెషల్ ఫోటో షూట్ చేస్తున్నారు. ఈ ఫోటో షూట్ అయ్యాక ఎవరన్నా మహేష్ బాబుకి పక్కన మరియు అనుకున్న పాత్రకి సెట్ కాకపోతే హీరోయిన్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. లేదా అన్నీ సెట్ అయితే ఈ ముగ్గురు భామలు మహేష్ తో జోడీ కడతారు. ఈ ముగ్గురు హీరోయిన్స్ ఫైనలైజ్ గురించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడచ్చు. మే లో ఈ బ్రహ్మోత్సవం సినిమా షూటింగ్ మొదలవుతుంది.
మహేష్ బాబు – కొరటాల శివ కాంబినేషన్ మూవీలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. జూలై 17న ఈ సినిమా రిలీజ్ కానుంది.