నిఖిల్ సినిమా బాలీవుడ్ రీమేకా.?

nikhil
ఓ డిఫరెంట్ కథని ఎంటర్టైనింగ్ గా చెబితే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు అనే ఫార్ములాని పర్ఫెక్ట్ గా ఫాలో అవుతున్న యంగ్ హీరో నిఖిల్. నిఖిల్ చేసిన ‘స్వామిరారా’, ‘కార్తికేయ’, ‘సూర్య వర్సెస్ సూర్య’ సినిమాలలో ఒక దానికి ఒకటి పొంతన ఉండదు. ఈ మూడు సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద హిట్ అయ్యాయి. హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న ఈ హీరో తన తదుపరి సినిమా ‘శంకరాభరణం’ని సెట్స్ పైకి తీసుకెళ్ళే పనిలో ఉన్నాడు.

ఈ సినిమాకి సంబందించిన ఓ ఆసక్తికర విషయాన్నీ మీకందిస్తున్నాం. ఈ శంకరాభరణం సినిమాకి కోన వెంకట్ సహా నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా, కథ – కథనం – మాటలను కూడా అందిస్తున్నాడు. లేటెస్ట్ గా ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా బాలీవుడ్ సూపర్ హిట్ కామెడీ ఫిల్మ్ ‘ఫస్ గయే రే ఓబామా’ అనే సినిమాకి రీమేక్ అని అంటున్నారు. కానీ ప్రస్తుతానికి అధికారిక ప్రకటన మాత్రం లేదు. ఉదయ్ నందనవనం దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాకి ప్రవీణ్ లక్కరాజు మ్యూజిక్ అందిస్తున్నాడు.

Exit mobile version