రీ రికార్డింగ్ కోసం కోట్లు ఖర్చుపెట్టిన గుణశేఖర్

rudhramadevi-guna-shekar
గుణశేఖర్ కలల ప్రాజెక్ట్ రుద్రమదేవి ప్రస్తుతం నిర్మాణాంతర దశలో వున్న విషయం మేము ముందుగానే తెలిపాం. అయితే ఈ సినిమా రీ రికార్డింగ్ పనుల కోసం దర్శకుడు ఇటీవలే హాలీవుడ్ వెళ్లి అక్కడ టాప్ మ్యుజీషియాన్ లతో పని చేసారు.

సమాచారం ప్రకారం కేవలం రీ రికార్డింగ్ కోసమే గుణశేఖర్ దాదాపు 2 కోట్లు ఖర్చుపెట్టినట్టు తెలుస్తుంది . భారతీయ చలన చిత్ర చరిత్రలోనే ఒక టెక్నికల్ అద్భుతంగా నిలిచిపోవాలని ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అనుష్క, అల్లు అర్జున్, నిత్యా మీనన్ ప్రధాన పాత్రధారులు. ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version