ఏప్రిల్‌ 23న రానున్న‘కాయ్‌ రాజా కాయ్‌’

kai-raja-kai
లో బడ్జెట్ లో సూపర్ హిట్ సినిమాలను అందించిన డైరెక్టర్ మారుతి. ఒక డైరెక్టర్ గానే కాకుండా నిర్మాతగా కూడా చిన్న సినిమాలు తీసిన వారిని ఎకంరేజ్ చేస్తుంటాడు. అలా మారుతి టాకీస్‌ సమర్పణలో ఫుల్‌మూన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై శివగణేష్‌ దర్శకత్వంలో రామ్‌ఖన్నా, మానస్‌, షామిలి, శ్రావ్య హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ‘కాయ్‌ రాజా కాయ్‌’. శివ గణేష్ మారుతి దగ్గర అసిస్టెంట్ గా పనిచేసాడు. చాలా రోజుల క్రితమే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమాని ఏప్రిల్ 23న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ఈ చిత్ర టీం సన్నాహాలు చేస్తోంది.

యూత్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి జె.బి సంగీతం అందిస్తున్నారు. ‘లవర్స్‌’ వంటి భారీ సక్సెస్‌ అనంతరం ‘మారుతి టాకీస్‌’ బ్యానర్‌ నుంచి వస్తున్న చిత్రం కావడంతో ‘కాయ్‌ రాజా కాయ్‌’ చిత్రంపై అటు ప్రేక్షకుల్లో` ఇటు చిత్ర పరిశ్రమలో మంచి అంచనాలు ఉన్నాయి. మాస్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే లవ్‌స్టోరిగా ‘కాయ్‌ రాజా కాయ్‌’ చిత్రాన్ని తెరకెక్కించారు.

Exit mobile version