షేరింగ్ ని నమ్ముతానంటున్న గ్లామ్ డాల్

Shruthi-hasan1
స్టార్ ఫాదర్ కి వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయం అయినా జయాపజయాలే ఫిల్మ్ ఇండస్ట్రీలో మన కెరీర్ ని నిర్ణయిస్తాయి. గ్లామరస్ డాల్ శ్రుతి హాసన్ కి కెరీర్ మొదట్లో అన్నీ అపజయాలే ఎదురయ్యాయి కానీ ఒక్క హిట్ తో తన కెరీర్ మొత్తం మారిపోయింది. ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుండడమే కాకుండా తన గ్లామరస్ టచ్ తో ఫ్యాన్ ఫాలోయింగ్ ని కూడా పెంచుకుంటోంది.

శృతి హాసన్ సినిమాల విషయంలో రిజల్ట్ ని అందరితో కలిసి షేర్ చేసుకోవడమే ఇష్టం అంటోంది. ‘ఒక సినిమా విజయం అనేది ఒక్క వ్యక్తి మీదే డిపెండ్ అయ్యి ఉండదు. అలాగే ఫెయిల్యూర్ కూడా ఒక్కరికే చెందదు. అందరూ కలిసి పనిచేస్తారు. అందుకే విజయం వస్తే నేను అందరికీ క్రెడిట్ ఇస్తాను. అదే ఫెయిల్ అయితే దాని గురించి ఎక్కువ ఆలోచించనని’ అంటోంది. శృతి హాసన్ ప్రస్తుతం తెలుగులో మహేష్ బాబు – కొరటాల శివ శ్రీ మంతుడు సినిమాలో నటిస్తోంది. అలాగే తమిళంలో విజయ్ సరసన ఓ సినిమా చేస్తోంది.

Exit mobile version