
‘ఊహలు గుసగుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్య’, ‘లక్ష్మి రావే మా ఇంటికి’ చిత్రాల తర్వాత యువ హీరో నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రం ‘జాదుగాడు’. ఇటివలే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్లకు మంచి స్పందన వస్తుంది. ‘చింతకాయల రవి’ ఫేం యోగేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సత్య ఎంటర్‌టైన్‌మెట్స్ పతాకంపై వి.వి.ఎన్ ప్రసాద్ నిర్మించారు.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ తనయుడు సాగర్ మహతి సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియోని కొద్దిసేపటి క్రితమే విడుదలచేసారు. పూర్తి కమర్షియల్ మాస్, యాక్షన్ లవ్, రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది. ఈ చిత్రం ద్వారా సోనారిక అనే కొత్త అమ్మాయి హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమవుతుంది.ఈ వేడుకలో మణిశర్మ, నందిని రెడ్డి, కోనా వెంకట్, మెహర్ రమేష్ తలుక్కున మెరిసారు.
ఇప్పటికే విడుదలైన ట్రైలర్లకు మంచి స్పందన వస్తుంది. త్వరలోనే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా నాగశౌర్యకు ఎలాంటి మాస్ ఇమేజ్ ను తెచ్చి పెట్టనుందో త్వరలోనే తెలియనుంది.