స్పీడ్ పెంచిన నాని ‘భలే భలే మగాడివోయ్’

nani
మన ఇంట్లో కుర్రాడిలా తెలుగు ప్రేక్షకుల మదిలో చోటు సంపాదించుకున్న యంగ్ హీరో నాని మళ్ళీ కెరీర్ లో వరుస సినిమాలతో బిజీ అయ్యాడు. ఇటీవలే రిలీజ్ అయిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘జెండా పై కపిరాజు’ సినిమాలతో కమర్షియల్ గా సక్సెస్ అందుకున్నాడు. ఈ రెండు సినిమాల సక్సెస్ ఇచ్చిన బూస్టప్ తో నాని కెరీర్ ని స్పీడప్ చేసాడు. ప్రస్తుతం నాని మారుతి డైరెక్షన్ లో చేస్తున్న సినిమా ‘భలే భలే మగాడివోయ్’.

నాని ఈ సినిమా షూటింగ్ ని శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. ఏ మాత్రం గ్యాప్ లేల్కుండా కంటిన్యూగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఇందులో నాని సరసన అందాల రాక్షసి అనిపించుకున్న లావణ్య త్రిపాటి హీరోయిన్ గా నటిస్తోంది. గీత ఆర్ట్స్ 2 బ్యానర్ – యువి క్రియేషన్స్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూర్తి కాగానే నాని హను రాఘవాపూడి డైరెక్షన్ లో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో చేయనున్న సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు.

Exit mobile version