ఆ వార్తల్లో నిజం లేదు : సింగర్ సునీత

sunitha
తన అద్భుతమైన గాత్రంతో కొన్ని వందల సినిమాల్లో ఎన్నో మంచి పాటలు పాడడమే కాక, ఎన్నో సినిమాలకు డబ్బింగ్ చెబుతూ తనకంటూ ఓ స్టార్ స్టేటస్ సంపాదించుకుంది సింగర్ సునీత. తాజాగా ఆమె మహేష్ బాబు, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పిందని ప్రచారం జరిగింది. అయితే అవన్నీ కేవలం వార్తలు మాత్రమేనని ఆమె స్పష్టం చేసింది. ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో పాత్రకు సంబంధించి తనను ఎవరూ సంప్రదించలేదని తెలిపింది.

ఇదే విషయమై సునీత ఓ ప్రముఖ దినపత్రికతో మాట్లాడుతూ.. “బ్రహ్మోత్సవం సినిమాలో నేను నటిస్తే బాగుంటుందన్న ఆలోచన ఎవరికైనా వచ్చిందేమో తెలీదు కానీ ఆ విషయమై నన్నైతే ఎవరూ సంప్రదించలేదు. పాటలు పాడడం, డబ్బింగ్ చెప్పడం నాకు నాకిష్టమైన విషయాలు. ఇక యాక్టింగ్ అనేది చాలా కష్టమైనది. అయితే ‘యాక్టింగ్ అనేదే చేయను’ లాంటి ప్రకటనలు మాత్రం చేయను. ఏదైనా సంగీత ప్రధాన సినిమా గానీ, ఆఫ్ బీట్ సినిమా గానీ వస్తే ఆలోచిస్తానేమో!” అంటూ తన భావాలను పంచుకుంది.

Exit mobile version