మే 2 వరకూ మహేష్ బాబు అక్కడేనట.!

Mahesh-babu
సూపర్ స్టార్ మహేష్ బాబు – ‘మిర్చి’ ఫేం కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తవుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కి ‘శ్రీమంతుడు’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. గత 15 రోజులుగా ఈ సినిమా షూటింగ్ మలేషియాలో జరుగుతోంది. అక్కడే మహేష్ బాబు, శృతి హాసన్, జగపతి బాబు, సుకన్య మిగిలిన కీలక నటీనటులపై కొన్ని కీలకమైన ఫ్యామిలీ సీన్స్ ని షూట్ చేస్తున్నారు. ముందుగా ఈ షెడ్యూల్ ని 22 కల్లా ఫినిష్ చేయాలనుకున్నారు కానీ తాజాగా ఈ షెడ్యూల్ మరో పది రోజులు మలేషియాలోనే జరగనుంది.

ఈ చిత్ర టీం చెప్పిన సమాచారం ప్రకారం మే 2 వరకూ ఈ సినిమా షూటింగ్ మలేషియాలో జరుగుతుంది. ఈ మలేషియా ఎపిసోడ్ సినిమాకి చాలా కీలకం అని కూడా అంటున్నారు. మే 3న ఈ చిత్ర టీం హైదరబాద్ తిరిగి వచ్చి ఇక్కడ లేటెస్ట్ షెడ్యూల్ ని మొదలు పెడతారు. మహేష్ బాబు సరసన మొదటి సారి శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో రాజేంద్ర ప్రసాద్, రాహుల్ రవీంద్రన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాని జూలై 17న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version