గ్రాండ్‌గా ‘S/O సత్యమూర్తి’ థ్యాంక్స్ మీట్!

So-Satyamurthy
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ల సూపర్‌హిట్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘S/O సత్యమూర్తి’. భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 9న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. విడుదలై రెండు వారాలైనా ఈ సినిమా స్టడీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. అల్లు అర్జున్ యాక్టింగ్‌కు, త్రివిక్రమ్ స్టైల్ మేకింగ్‌కు మంచి మార్కులు పడ్డాయి. ఇక భారీ ఎత్తున ఎక్కువ థియేటర్లలో విడుదలవ్వడం, సినిమాకు మంచి స్పందన రావడంతో ‘S/O సత్యమూర్తి’ మొదటి వారం కలెక్షన్లను కుమ్మేసింది. రెండో వారం కలెక్షన్లు కూడా స్టడీగా ఉండడం విశేషం. సమంత, నిత్యామీనన్, అదాశర్మలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచారు.

ఇక ‘S/O సత్యమూర్తి’ విడుదలైన అన్ని ప్రాంతాల్లో రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతున్న సందర్భంగా సినిమా యూనిట్ నిన్న సాయంత్రం ఓ థ్యాంక్యూ మీట్‌‌ను ఏర్పాటు చేసింది. విశాఖపట్నంలోని గురజాడ కళాక్షేత్రంను ఈ థ్యాంక్యూ మీట్‌కు వేదికగా ఎంచుకున్నారు. హీరో అల్లు అర్జున్, త్రివిక్రమ్‌లు పాల్గొని సినిమాకు మంచి విజయాన్ని చేకూర్చినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ థ్యాంక్యూ మీట్‌కు భారీ ఎత్తున అభిమానులు హాజరయ్యారు. అల్లు అర్జున్‌ను చూసేందుకు అభిమానులు ఉత్సాహాన్ని కనబరిచారు.

Exit mobile version