యంగ్ హీరో కోసం క్రేజీ కాంబినేషన్.?

Sundeep_Kishan
ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోస్ లో సినిమా సినిమాకి తన స్థాయిని, మార్కెట్ ని పెంచుకోవడానికి ట్రై చేస్తున్న హీరో సందీప్ కిషన్. సందీప్ కిషన్ – రాహుల్ రవీంద్రన్ కలిసి నటించిన ‘టైగర్’ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంటోంది. సందీప్ కిషన్ ప్రస్తుతం ఓ డార్క్ క్రైమ్ కామెడీ తమిళ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

ప్రసతుతం సందీప్ కిషన్ హీరోగా ఓ క్రేజీ ప్రాజెక్ట్ తయారవుతున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఆ కాంబినేషన్ కి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు శ్రీకారం చుడుతున్నట్లు సమాచారం. ఆ కాంబినేషన్ ఏమిటంటే వివి వినాయక్ డైరెక్షన్ లో సందీప్ కిషన్ హీరోగా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు. అందులో సమంత హీరోయిన్ గా నటించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సినిమాని చోటా కె నాయుడు నిర్మించాలనుకుంటున్నట్లు సమాచారం. అన్నీ కుదిరితే ఈ కాంబినేషన్ లో మూవీ ఈ సంవత్సరం చివర్లో మొదలు కావచ్చు.

Exit mobile version