జయాపజయాలను పక్కన పెట్టి ఎప్పటికప్పుడు డిఫరెంట్ స్టోరీస్ తో ప్రేక్షకులను మెప్పించే స్టార్ హీరో ఉలగనాయగన్ కమల్ హాసన్ చేసిన మరో ప్రయోగమే ‘ఉత్తమ విలన్’. అనుకున్న తేదీకంటే ఒకటిన్నర రోజు ఆలస్యంగా రిలీజ్ అయిన ఈ సినిమాకి బాక్స్ ఆఫీసు వద్ద మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఉత్తమ విలన్ లో కమల్ హాసన్, బాల చందర్ తో పాటు మిగిలిన నటీనటుల పెర్ఫార్మన్స్ ని బాగా మెచ్చుకున్నా సినిమా పరంగా అంట బాగా లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. దాని ప్రధాన కారణంగా ఈ సినిమా రన్ టైంని చెబుతున్నారు. ఇలా అందరి ఫీడ్ బ్యాక్ తీసుకున్న ఈ చిత్ర టీం ఓ నిర్ణయం తీసుకుంది.
అదే ఈ సినిమా రన్ టైంని తగ్గించడం.. ఈ చిత్ర టీం ఉత్తమ విలన్ లో సుమారు 21 నిమిషాలు ట్రిమ్ చెయ్యాలని నిర్ణయించుకుంది. 21 నిమిషాల సినిమాలో ట్రిమ్ చేయడం వలన సినిమా ఇప్పుడు మరింత వేగంగా ఉంటుందని, ఆడియన్స్ కి బాగా నచ్చుతుందని అంటున్నారు. త్వరలోనే అన్ని స్క్రీన్స్ లో ట్రిమ్ చేసిన వెర్షన్ ని ప్లే చేస్తారు.
కమల్ హాసన్ హీరోగానే కాకుండా కథ – స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాకి రమేష్ అరవింద్ డైరెక్టర్. ఒక సినీ నటుడు జీవితం చుట్టూ తిరిగే ఈ కథలో రియల్ లైఫ్ మూవీ లెజెండ్స్ అయిన బాల చందర్, కె.విశ్వనాధ్ లు నటించారు. కమల్ హాసన్ సరసన పూజ కుమార్, ఆండ్రియా జెరెమియా హీరోయిన్స్ గా నటించారు. జిబ్రాన్ మ్యూజిక్ అందించాడు.
