
రోజురోజుకూ రాజమౌళి క్రేజ్ పెరిగిపోతూ వస్తుంది. ఒక సినిమాకు విడుదలకు ముందే ఎంతటి హైప్ తీసుకురావచ్చో తెలుసుకోవాలంటే రాజమౌళిని సంప్రదించాల్సిందే. బాహుబలి సినిమా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యతను సంతరించుకుంది.
ఈ సినిమా పాత్రల పోస్టర్ లు ఈరోజుతో పూర్తవడంతో ఇప్పుడు అందరి కళ్ళూ త్వరలో విడుదలకానున్న ఆడియో లాంచ్ పై పడనున్నాయి. సౌత్ ఇండియాకి సంబంధించిన ప్రముఖ స్టార్లంతా ఈ వేడుకకు హాజరుకానున్నారు.
దాదాపు మూడేళ్ళుగా షూటింగ్ సాగుతున్న చిత్రం ట్రైలర్ ఎలా వుంటుందా అని అందరు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. కీరవాణి సంగీత దర్శకుడు. ఆర్కా మీడియా సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.