ఎప్పటికప్పుడు వైవిధ్యమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న యంగ్ హీరో నారా రోహిత్. ఈ యువ హీరో నటించిన మరో డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ ‘అసుర’. అసుర సినిమాని ఈ నెల 29న గ్రాండ్ గా రిలీజ్ చెయ్యాలనే ప్లాన్ లో ఉన్నారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ వారు ఈ సినిమాకి ‘యు/ఏ’ సర్టిఫికేట్ ఇచ్చారు. సెన్సార్ బోర్డ్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం సినిమాకి చాలా పాజిటివ్ టాక్ చెబుతున్నారు. కచ్చితంగా నారా రోహిత్ చేతిలో హిట్ మెటీరియల్ ఉందని అంటున్నారు.
ఈ చిత్ర టీం కూడా ఈ సినిమా విజయం పై సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఓ థ్రిల్లర్ కథాశం తో రూపొందిన ఈ సినిమాలో వచ్చే సస్పెన్స్ ఎలిమెంట్స్ ఆడియన్స్ ని కచ్చితంగా థ్రిల్ చేస్తాయని అంటున్నారు. ఈ మూవీ ట్రైలర్ కి కూడా సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. కృష్ణ విజయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియా బెనర్జీ హీరోయిన్. జేమ్స్ మధు, సత్య తదితరులు ఇతర పాత్రలు పోషించారు. సాయి కార్తీక్ సంగీతం అందించిన ఈ సినిమాని నారా రోహిత్ సమర్పణలో శ్యామ్ దేవభక్తుని ఈ సినిమాను నిర్మించారు.
