సింగిల్ టెక్ లో 8 పేజీల డైలాగ్స్ చెప్పిన నాని

nani
మన ఇంట్లో కుర్రాడిలా తెలుగు ప్రేక్షకుల మదిలో చోటు సంపాదించుకున్న యంగ్ హీరో నాని. ఈ ఏడాది ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘జెండా పై కపిరాజు’ సినిమాలతో కమర్షియల్ గా సక్సెస్ అందుకున్న నాని ప్రస్తుతం తన తదుపరి సినిమాల షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. నాని నుంచి రానున్న నెక్స్ట్ మూవీ ‘భలే భలే మగాడివోయ్’. లో బడ్జెట్ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న మారుతి ఈ సినిమాకి డైరెక్టర్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

తాజాగా ఈ చిత్ర టీం నుంచి అందిన సమాచారం ప్రకారం ఒక సీన్ లో నాని చేసిన పెర్ఫార్మన్స్ కి టీం అంతా మెస్మరైజ్ అవ్వడమే కాకుండా టీం అంతా చప్పట్లతో నానిని అభినందిచారట. ఈ సినిమా క్లైమాక్స్ లో చాలా కీలకమైన ఓ ఎమోషనల్ సీన్ ఉంది. 8 పేజీల డైలాగ్స్ తో కూడిన ఈ ఎమోషనల్ సీన్ ని నాని సింగిల్ టెక్ లో ఫినిష్ చేయడమే కాకుండా సీన్ కి కావాల్సిన అద్భుతమైన హావభావాలను పలికించడంతో టీం అంతా నాని పెర్ఫార్మన్స్ కి ముగ్దులయ్యారు. ఈ సినిమాలో ఈ సీన్ హైలైట్ అని తెమ చెబుతోంది. నాని సరసన ‘అందాల రాక్షసి’ అనిపించుకున్న లావణ్య త్రిపాటి హీరోయిన్ గా నటిస్తోంది. గీత ఆర్ట్స్ 2 బ్యానర్ – యువి క్రియేషన్స్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

ఈ సినిమా పూర్తి కాగానే నాని హను రాఘవాపూడి డైరెక్షన్ లో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో చేయనున్న సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు.

Exit mobile version