ఫోటో మూమెంట్ : కొత్త బెంజి కారుతో హ్యాట్రిక్ హీరో!

nikhil
సరికొత్త కథాంశాలతో తెరకెక్కిన మూడు వరుస హిట్ సినిమాల తర్వాత నిఖిల్ ‘శంకరాభరణం’ పేరుతో మరో సరికొత్త క్రైమ్ కామెడీ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే! బీహార్ నేపథ్యంలో నడిచే ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే.. వరుస హిట్లతో హ్యాట్రిక్ హీరో అనే అరుదైన స్టేటస్‌ను సొంతం చేసుకున్న నిఖిల్, ఆ ట్యాగ్ ఇచ్చిన ఆనందంలో ఓ మంచి తనకు తానే ఓ ఖరీదైన గిఫ్ట్ ఇచ్చుకున్నాడు. బెంజి కంపనీకి చెందిన ఓ స్పోర్ట్స్ కూపే కారును కొనుగోలు చేసి దానిముందు స్టైల్‌గా నిలబడి పోజిచ్చాడు నిఖిల్. ఈ ఫోటోను తన ట్విట్టర్ ఎకౌంట్‌లో పోస్ట్ చేస్తూ కొత్త కారును కొన్నానని చెప్పుకొచ్చాడు. రెడ్ కలర్‌లో మెరిసిపోతున్న కారు ముందు నిఖిల్ మరింత మెరిసిపోతున్నాడు కదూ..?!

Exit mobile version