చెర్రీ సినిమాకు దిష్టి తగులుతుందని..!

Kona-Venkat3

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు శ్రీనువైట్ల ఓ భారీ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. గతంలో శ్రీనువైట్లతో కలిసి సూపర్ హిట్ సినిమాలకు రచయితలుగా పనిచేసిన కోన వెంకట్, గోపీ మోహన్‌లు కొంత గ్యాప్ తర్వాత శ్రీనువైట్లతో కలిసి పనిచేస్తున్నారు. డీవీవీ దానయ్య చాలా రిచ్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక కొంతకాలం క్రితం ఇటలీ, స్పెయిన్‌లలోని అందమైన లొకేషన్లలో ఒక షెడ్యూల్‌ను పూర్తి చేయగా ప్రస్తుతం హైద్రాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఇక చెర్రీ సినిమా ప్రోగ్రెస్‌పై యూనిట్ అంతా చాలా హ్యాపీగా ఉందట. “చరణ్ సినిమాకు అన్నీ శుభ పరిణామాలే జరుగుతున్నాయి. సినిమా చాలా బాగా వస్తోంది. దిష్టి తగులుతుందని కొన్ని ఆసక్తికర విషయాలని ఇప్పుడే చెప్పదల్చుకోలేదు” అని తెలియజేస్తూ రచయిత కోన వెంకట్ ఓ ట్వీట్ చేయడం అభిమానుల్లో ఆనందాన్ని నింపింది. ఆ ఆసక్తికర అంశాలు ఏమై ఉంటాయనే దానిపై అభిమానులు ఇప్పటికే ఆలోచనల్లో పడ్డారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ స్టంట్ మాస్టర్‌గా కనిపిస్తాడని తెలుస్తోంది. భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు శ్రీనువైట్ల మార్క్ కామెడీ సన్నివేశాలతో ఈ సినిమా అందరినీ అలరించేలా ఉండనుందని తెలుస్తోంది. దసరా కానుకగా అక్టోబర్ 15న సినిమా విడుదల చేయాలని నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.

Exit mobile version