మహేష్ ‘శ్రీమంతుడు’ గ్రాండ్ సక్సెస్ మీట్ డీటైల్స్

srimnathudu

కమర్శియాలిటీ కోసం పరుగులు తీస్తూ ఒకేరకమైన రొటీన్ సినిమాలు మన టాలీవుడ్ లో తరచుగా వస్తూనే ఉన్నాయి. కానీ వాటికి భిన్నంగా ఓ డిఫరెంట్ పాయింట్ తో ఓ సినిమా చేసినప్పుడు ఆ సినిమాని తెలుగు ప్రేక్షకులు మెచ్చుకొని పెద్ద సక్సెస్ చేసినప్పుడు వచ్చే ఆనందాన్ని మరేదీ ఇవ్వలేదు అని చెప్పడంలో ఎలాంటి అనుమానమూ లేదు. ప్రస్తుతం అలాంటి ఆనందాన్నే ఎంజాయ్ చేస్తున్నాడు మన టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు. కొరటాల శివ డైరెక్షన్ లో మహేష్ బాబు నటించిన ‘శ్రీమంతుడు’ సినిమా 10 రోజుల క్రితం రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీసు వద్ద సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో ప్రేక్షకులు కోరుకునే అన్ని కమర్షియల్ అంశాలు ఉన్నాయి, కానీ వాటన్నిటికీ మించి ఇందులో చెప్పిన ఓ సోషల్ కంటెంట్ విషయంలో ఈ చిత్ర టీం ప్రతి ఒక్కరి నుంచీ మనన్ననలు దక్కుతున్నాయి.

ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద కూడా సుమారు 60 కోట్ల షేర్ మార్క్ ని టచ్ చేయనుంది. అంతే కాకుండా మొదటి 8 రోజుల్లోనే దాదాపు అన్ని ఏరియాల డిస్ట్రిబ్యూటర్స్ వారు పెట్టిన అమౌంట్ బ్రేక్ అయిపోయి, లాభాలను అందుకుంటున్నారు. మహేష్ అండ్ టీం అటెంప్ట్ చేసిన ఈ కొత్త పాయింట్ ని ఇంతలా ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు స్పెషల్ గా థాంక్స్ చెప్పాలని ఈ చిత్ర టీం భావించింది. అందుకే ‘థాంక్యూ మీట్’ చెయ్యడానికి నిర్ణయించారు. ఈ థాంక్యూ మీర్ కోసం ఈనెల 20వ తేదీన హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో గ్రాండ్ గా జరగనుంది. ఈ కార్యక్రమానికి మహేష్ బాబుతో పాటు ఈ చిత్రంలో నటించిన నటీనటులు, ఈ చిత్రానికి పనిచేసిన టెక్నికల్ టీం మొత్తం హాజరు కానుంది. ఈ వేడుక ద్వారా మహేష్ తన ప్రతి ఒక్క అభిమానికి, తెలుగు ప్రేక్షకులకు తన ధన్యవాదాలు తెలుపుకోనున్నాడు.

Exit mobile version