
మొదటి పార్ట్ లో రవితేజ తన కిక్ కోసం ఎంతపని చెయ్యడానికైనా సిద్దపడతాడు, అలానే ఇందులో కూడా రవితేజ తన కంఫర్ట్ కోసం పక్కోడితో కబడ్డీ ఆడుకునే టైపు. ఇటీవలే రిలీజ్ అయిన ట్రైలర్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. అదే కాక తమన్ అందించిన పాటలకి కూడా సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో తెలుగు ప్రక్షకులతో పాటు సినిమా ఇండస్ట్రీ కూడా ఈ క్రేజీ సీక్వెల్ కోసం ఎదురు చూస్తున్నారు. రవితేజ సరసన ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల కలల రాణిగా మారిన రకుల్ ప్రీత్ ఇస్ంగ్ హీరోయిన్ గా కనిపించనుంది. మొదటి పార్ట్ లో లానే రవితేజ – బ్రహ్మానందం కామెడీ ఈ సినిమాకి ప్రధాన హైలైట్ కానుంది. టోటల్ డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో రానున్న ఈ సినిమాలో రేసుగుర్రం ఫేం రవి కిషన్, జిల్ ఫేం కబీర్ సింగ్ లు విలన్స్ గా కనిపించనున్నారు. ఈ సినిమాని ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మించాడు.