నా కెరీర్లో బిగ్ బడ్జెట్ చిత్రం కిక్ 2 – రవితేజ

Ravi-teja
2009లో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వచ్చిన ‘కిక్’ సినిమా పెద్ద హిట్. అలాంటి సినిమాకి సీక్వెల్ చెయ్యడం చాలా సాహసం అని చెప్పాలి. కానీ రవితేజ – సురేందర్ రెడ్డి కలిసి ఆ సాహసాన్ని చేసారు. అలా సాహసం చేసి చేసిన సినిమానే ‘కిక్ 2’. మామూలుగా తెలుగులో సీక్వెల్ చేయడం అంటే అదో పెద్ద రిస్క్ అంటారు. అలాంటి రిస్క్ ని చాలెంజింగ్ గా తీసుకొని ముందుకు వచ్చిన నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్. సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుని ‘యు/ఏ’ సర్టిఫికేట్ అందుకున్న కిక్ 2 సినిమా ఆగష్టు 21న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

ఈ సినిమా రిలీజ్ కి మరో రెండు రోజులు మాత్రమే ఉండడంతో ఈ చిత్ర టీం జోరుగా ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. నిన్నటి నుంచి రవితేజ మీడియా లో సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. రీసెంట్ గా జరిగిన ఓ మీడియా ఇంటరాక్షన్ లో కిక్ 2 విషయంలో అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ పెట్టినట్టున్నారు అని అడిగితే ‘సినిమా బడ్జెట్ గురించి తెలియాలి అంటే మీరు కళ్యాణ్ రామ్ ని అడగాలి. నాకు తెలిసినంత వరకూ నా కెరీర్లో ఇదే బిగ్ బడ్జెట్ మూవీ. సినిమా చాలా లావిష్ గా, చాలా గ్రాండ్ గా ఉంటుంది. యాక్షన్ ఎపిసోడ్స్ మునుపెన్నడూ చూడని రీతిలో ఉంటాయని’ రవితేజ తెలిపాడు.

రవితేజ సరసన టాలీవుడ్ గోల్డెన్ గర్ల్ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా కనిపించనుంది. టోటల్ డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో రానున్న ఈ సినిమాలో రేసుగుర్రం ఫేం రవి కిషన్, జిల్ ఫేం కబీర్ సింగ్ లు విలన్స్ గా కనిపించనున్నారు. ఈ చిత్ర టీం ఎంతో రిస్క్ చేసి చేసిన ఈ కిక్ 2 సీక్వెల్ ఎలా ఉంటుందనేది తెలియాలంటే మరో 2 రోజులు ఆగాల్సిందే..

Exit mobile version