నితిన్ సినిమాతో బ్యాక్ అంటున్న సందీప్ చౌత

sandeep-chowta
‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘హార్ట్ అటాక్’, ‘చిన్నదానా నీకోసం’ లాంటి రొమాంటిక్ ఎంటర్టైనర్స్ తో వరుసగా తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన యంగ్ హీరో నితిన్ ‘చిన్నదానా నీకోసం’ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ఆ గ్యాప్ ని ఫిల్ చేసేందుకు నితిన్ త్వరలోనే ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాతో అప్పట్లో ‘నిన్నే పెళ్ళాడతా’, ‘ప్రేమకథ’, ‘సూపర్’, ‘బిజ్జిగాడు’ లాంటి సినిమాలకు సూపర్ హిట్ మ్యూజిక్ అందించిన సందీప్ చౌత టాలీవుడ్ లో మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ సినిమాకి సింగర్ కార్తీక్ మ్యూజిక్ అందించాడు.

కానీ ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సందీప్ చౌత అందించాడు. సస్పెన్స్ థ్రిల్లర్ గా సాగే ఈ సినిమాకి సందీప్ చౌత అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకే పెద్ద హెల్ప్ అవుతుందని ఈ చిత్ర నిర్మాత గౌతమ్ మీనన్ తెలిపాడు. ఒక కొరియర్ బాయ్ లైఫ్ లో ఒక కొరియర్ ఎలాంటి మార్పులను తెచ్చింది అనేదే ఈ సినిమా కథాంశం. నితిన్ సరసన యామి గౌతమ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. గురు ఫిలిమ్స్ – మల్టీ డైమెన్షన్స్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ద్వారా ప్రేమ్ సాయి దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఇది కాకుండా నితిన్ త్వరలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో చేయనున్న సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నాడు.

Exit mobile version