పవన్ తో పనిచేయాలనుకుంటున్న యంగ్ తమిళ్ డైరెక్టర్

pawan-susseth
టాలీవుడ్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ప్రతి ఒక్క స్టార్ డైరెక్టర్ లేదా యంగ్ డైరెక్టర్స్ పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేసే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇదే కోరిక ఒక్క తెలుగు డైరెక్టర్స్ కి మాత్రమే కాదు పలువురు తమిళ డైరెక్టర్స్ కి కూడా ఉంది. ఇప్పటికే కరుణాకరన్, ఎస్.జె సూర్య, ధరణి లాంటి తమిళ డైరెక్టర్స్ ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో పనిచేసారు. తాజాగా మరో యంగ్ తమిళ డైరెక్టర్ పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చెయ్యాలని ఆరాటపడుతున్నాడు. అతనే సుసీంద్రన్.

సుసీంద్రన్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ ‘జయసూర్య’. విశాల్ – కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 4న ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్న సుసీంద్రన్ పవన్ కళ్యాణ్ గురించిన ఆసక్తిక విషయాలను తెలిపాడు. ‘నేను ఒక పవర్ఫుల్ స్క్రిప్ట్ రాశాను, నా ప్రకారం అది పవన్ కళ్యాణ్ గారికి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. అతనితో సినిమా చేయాలనే కోరిక ఎప్పటి నుంచో ఉందని’ సుసీంద్రన్ తెలియజేశాడు. కానీ ఈ సినిమా కథని పవన్ కి చెప్పాడా లేక చెప్పే ప్రయత్నాల్లో ఉన్నాడా అనే విషయాన్ని మాత్రం ఖరారు చేయలేదు. ఈ విషయంలో ఎలాంటి ఒక క్లారిటీ రావాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. గతంలో సుసీంధ్రన్ దర్శకత్వం వహించిన కార్తీ ‘నా పేరు శివ’, విశాల్ ‘పల్నాడు’, ‘ఇంద్రుడు’ సినిమాలు తెలుగులో కూడా ఆమంచి విజయాలను అందుకున్నాయి.

Exit mobile version