
‘టెంపర్’ సక్సెస్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని తన లుక్ ని మొత్తం మార్చుకొని యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ సుకుమార్ డైరెక్షన్ లో తన 25వ సినిమాని మొదలు పెట్టాడు. జూలై మొదటి వారం నుంచి లండన్ లో మొదలైన ఈ సినిమా షూటింగ్ మొదలైంది. మొదలైన నాటి నుంచి ఎన్.టి.ఆర్ ఏ మాత్రం గ్యాప్ లేకుండా నిర్విరామంగా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. గత రెండు నెలలుగా ఏకధాటిగా రోజూ షూటింగ్ లో పాల్గొన్న ఎన్.టి.ఆర్ తన పార్ట్ షూటింగ్ కి కాస్త గ్యాప్ ఇచ్చి చిన్న విరామం తీసుకున్నాడు. తను గ్యాప్ తీసుకున్నా సుకుమార్ మాత్రం మిగతా నటీనటులపై వచ్చే సన్నివేషాలను షూట్ చేస్తూ బిజీగా ఉన్నాడు.
కొద్ది రోజుల షార్ట్ గ్యాప్ తీసుకున్న ఎన్.టి.ఆర్ ఈ సమయాన్ని అక్కడే ఉన్న తన కుమారుడు అభయ్ రామ్ తో గడుపుతున్నాడు. షార్ట్ గ్యాప్ తీసుకున్న ఎన్.టి.ఆర్ త్వరలోనే మళ్ళీ షూటింగ్ లో పాల్గొంటాడు. ఇప్పటకే 50% కి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ మరో నెల రోజుల పాటు లండన్ లోనే జరగనుంది. ఆ తర్వాత అక్కడి నుంచి మరో యూరప్ కంట్రీకికి షిఫ్ట్ అవుతుంది. ఎన్.టి.ఆర్ ఈ సినిమాలో ఎంత స్టైలిష్ గా కనిపిస్తాడో అంతే స్టైలిష్ గా యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఉండనున్నాయని ఈ చిత్ర టీం అంటోంది. ఎన్.టి.ఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్ లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ‘నాన్నకు ప్రేమతో’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్న ఈ సినిమాని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తుండగా, దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.