‘చీకటి రాజ్యం’ ట్రైలర్ విడుదల తేదీ ఖరారు

Kamal-Cheekati-Rajyam
ప్రయోగాలకు పెట్టింది పేరైన నటుడు కమల్ హాసన్ తాజాగా చేస్తోన్న మరో ప్రయోగమే ‘చీకటి రాజ్యం’. ఒకే ఒక్కరాత్రి జరిగే సంఘటనల నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుంది. ఇక నటుడిగానే కాక, రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా కూడా తానేంటో నిరూపించుకున్న కమల్, ఈ సినిమాకు కథ-కథనాలను అందించడంతో పాటు స్వయంగా నిర్మించారు. గతంలో కమల్ హీరోగా రూపొందిన పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన రాజేష్.ఎమ్.సెల్వ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

తెలుగు, తమిళంలో ఏకకాలంలో తెరకెక్కిన ఈ సినిమా కేవలం 40 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. సినిమా సెట్స్‌పైకి వెళ్ళినరోజే విడుదలైన ఫస్ట్‌లుక్‌కు విపరీతమైన రెస్పాన్స్ రాగా, త్వరలోనే ట్రైలర్ ద్వారా మరింత మెప్పించేందుకు సినిమా యూనిట్ సిద్ధమవుతోంది. ఇప్పటికే ట్రైలర్ పనులన్నీ పూర్తి కావస్తున్నాయి. ఇక సెప్టెంబర్ 16న తెలుగు, తమిళ ట్రైలర్‌లను ఒకేసారి విడుదల చేయనున్నట్లు సినిమా యూనిట్ తెలిపింది. అదేరోజు రిలీజ్ డేట్ కూడా ప్రకటించే అవకాశముంది. ఇక త్రిష, ప్రకాష్ రాజ్, సంపత్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా తమిళంళో ‘తూంగవనం’ పేరుతో తెరకెక్కింది.

Exit mobile version