
‘గోపాల గోపాల’ లాంటి క్లాస్ మల్టీ స్టారర్ మూవీ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మాస్ బ్రాండ్ మార్క్ తో చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’. ‘గబ్బర్ సింగ్’ తర్వాత పవన్ కళ్యాణ్ మరోసారి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న ఈ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకొని షార్ట్ గ్యాప్ తీసుకుంది. ఇటీవలే పవన్ తన బర్త్ డే వేడుకలకు దూరంగా ఉండడం కోసం అవుట్ అఫ్ స్టేషన్ వెళ్లాడనే విషయాన్ని ఇది వరకే తెలియజేశాం. అలాగే సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా మూడవ షెడ్యూల్ ని సెప్టెంబర్ మొదటి వారం చివరి నుంచి మొదలు పెడతారని తెలియజేశాం. పవన్ బర్త్ డే కానుకగా రిలీజ్ అయిన ఫస్ట్ టీజర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
మాకు అందిన తాజా సమాచారం ప్రకారం ఈ రోజు నుంచి ఈ చిత్ర టీం కొత్త షెడ్యూల్ ని రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలు పెట్టారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం రేపటి నుంచి అనగా మంగళవారం నుంచి సెట్లో జాయిన్ అవుతాడు. ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ తో పాటు మెయిన్ విలన్స్ లో ఒకరుగా కనిపించనున్న కబీర్ దుహ సింగ్ కూడా జాయిన్ కానున్నాడు. పవన్ కళ్యాణ్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి బాబీ దర్శకుడు. శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పటికే దేవీశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి అదిరిపోయే మూడు ట్యూన్స్ అందిచాడని సమాచారం.