
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ‘గబ్బర్ సింగ్’. ఆ సినిమాలోని పోలీస్ యాటిట్యూడ్ ని కంటిన్యూ చేస్తూ మరోసారి పవన్ పోలీస్ ఆఫీసర్ గా చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకొని షార్ట్ గ్యాప్ తీసుకున్న ఈ చిత్ర టీం నేటి నుంచి తిరిగి మూడవ షెడ్యూల్ ని హైదరాబాద్ లో ప్రారంభించనుంది. ఇటీవలే తన బర్త్ డే వేడుకలకు దూరంగా ఉండడం కోసం అవుట్ అఫ్ స్టేషన్ వెళ్ళిన పవన్ కళ్యాణ్ కూడా నేటి నుంచి షూటింగ్ లో పాల్గొననున్నాడు.
మాకు అందిన తాజా సమాచారం ప్రకారం ఈ రోజు నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలైన మూడవ షెడ్యూల్ ఈ నెలాఖరు వరకూ కంటిన్యూగా షూటింగ్ జరగనుంది. ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ తో పాటు మెయిన్ విలన్స్ లో ఒకరుగా కనిపించనున్న కబీర్ దుహ సింగ్ కూడా జాయిన్ కానున్నాడు. త్వరలోనే హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా షూటింగ్ లో జాయిన్ కానుంది. ఈ షెడ్యూల్ తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ గుజరాత్ కి షిఫ్ట్ కానుంది. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫస్ట్ టీజర్ పవన్ బర్త్ డే కానుకగా రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పటికే దేవీశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి అదిరిపోయే మూడు ట్యూన్స్ అందిచాడని సమాచారం.