‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సక్సెస్ ని ఫుల్ ఎంజాయ్ చేస్తున్న టీం

Subramanyam-For-Sale
మెగా హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన సినిమా ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’. మాస్ పల్స్ తెలిసిన కమర్షియల్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో సూపర్ సక్సెస్ఫుల్ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా నిన్న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది. అంతే కాకుండా మొదటి షో నుంచే ఫుల్ పాజిటివ్ మౌత్ టాక్ రావడంతో సినిమా సాయిధరమ్ తేజ్ కెరీర్లో సూపర్బ్ కలెక్షన్స్ ని నమోదు చేస్తోంది. దీంతో ఈ చిత్ర టీం చాలా ఆనందంగా ఉండడమే కాకుండా ఈ సక్సెస్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

సుబ్రమణ్యం ఫోర్స్ సేల్ తెమ వారి ఆనందాన్ని మీడియాతో పంచుకోవడమే కాకుండా ఇంత సక్సెస్ చేసిన తెలుగు ప్రేక్షకులకు స్పెషల్ థాంక్స్ కూడా చెప్పారు. దిల్ రాజు మాట్లాడుతూ ‘సుబ్రమణ్యం ఫర్ సేల్ కి మొదటి షో నుంచే పాజిటివ్ మౌత్ టాక్ ని స్ప్రెడ్ చేస్తూ, సినిమాని పెద్ద సక్సెస్ చేస్తున్న ప్రేక్షకులకు నా స్పెషల్ థాంక్స్’ తెలిపాడు. డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ ‘ఫస్ట్ హాఫ్ లో వచ్చే అన్ని ఎలిమెంట్స్ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే సెకండాఫ్ లో ఫిష్ వెంకట్ సీన్స్ బాగా పండాయి. ముఖ్యంగా వాట్స్ అప్ సీన్ కి చాలా రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా డైలాగ్స్ కి చాలా బాగున్నాయని చాలా మెచ్చుకుంటున్నారు. చాలా కాల్స్ వచ్చాయి. ఇంట పెద్ద సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని’ అన్నాడు.

సాయిధరమ్ తేజ్ – రెజీన కసాండ్ర జంటగా నటించిన ఈ సినిమాకి వీరిద్దరి కెమిస్ట్రీనే స్పెషల్ హైలైట్ అయ్యింది. మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందించాడు.

Exit mobile version