మణిరత్నం మల్టీ స్టారర్ మూవీలో యాక్టర్స్ ఎవరు.?

manirathnam

ఎన్ని ఫ్లాప్స్ ఉన్న దర్శకుడికైనా, హీరోకైనా ఒక్క హిట్ వస్తే వాళ్ళలో నూతన ఉత్తేజం వస్తుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే.. సౌత్ ఇండియన్ మోస్ట్ ఫేమస్ డైరెక్టర్ మణిరత్నం.. కానీ గత కొన్నేళ్లుగా హిట్స్ లేవు కానీ ఈ ఏడాది మాత్రం ‘ఓకే కన్మణి లేదా ఓకే బంగారం’ సినిమాతో హిట్ అందుకున్నాడు. ఈ సినిమా సక్సెస్ ఇచ్చిన ఎనర్జీతో మణిరత్నం వెంటనే మరో సినిమా చేయడానికి సిద్దం అయ్యాడు. అది కూడా మల్టీ స్టారర్, దానికోసం నటీనటుల్ని కూడా సెలక్ట్ చేసాడు. వాళ్ళే తమిళ యంగ్ హీరో కార్తీ – మలయాళ యంగ్ హీరో దల్క్వేర్ సల్మాన్. వీరితో పాటు నిత్యా మీనన్, కీర్తి సురేష్ లను కూడా హీరోయిన్ లుగా ఎంపిక చేసాడు. అలాగే సినిమాని డిసెంబర్ నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లాలనుకున్నాడు. కానీ ఇప్పుడది వాయిదా పడింది.

దానికి కారణం దల్క్వేర్ సల్మాన్ మరియు నిత్యా మీనన్ లు మరో 6 నెలల పాటు వేరే సినిమాలతో బిజీగా ఉండడం వల్ల డేట్స్ దొరకలేదు. ఈ విషయంలో మణిరత్నం నిరాశ పడకుండా వారిని టైం తీసుకొని ఆ తర్వాత తనకి డేట్స్ ఇవ్వమని చెప్పడంతో ఈ సినిమా 2016 సమ్మర్ లో ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే ముందుగా ఈ సినిమాని తమిళ్ మలయాళంలో తెరకెక్కించి తెలుగులో డబ్ చేద్దాం అనుకున్నారు, కానీ తాజాగా మణిరత్నం తమిళ మరియు తెలుగు భాషల్లో ద్విభాషా చిత్రంగా, ఒకేసారి వేరే నటీనటులతో తెలుగులో కూడా చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసమే ఆయన తెలుగు నటీనటుల వేటలో ఉన్నారు.

గత ఏడాది తెలుగులో నాగార్జున – మహేష్ బాబులతో ఓ సినిమా చేయడానికి మణిరత్నం ప్లాన్ చేసాడు, కనీ ఆగిపోయింది. అదే కథనే దల్క్వేర్ – కార్తీలతో ప్లాన్ చేసాడు. అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ టాలీవుడ్ కి ఆ కథ వస్తుండడంతో మణిరత్నం మళ్ళీ నాగ్ – మహేష్ లను అప్రోచ్ అవుతాడా లేక వేరే ఎవరినన్నా తీసుకుంటాడా అన్నది తెలియాల్సి ఉంది.

Exit mobile version