‘బ్రూస్ లీ’ ఆడియో లాంచ్ లో చిరు గుట్టు విప్పేనా.!

chiru-ram-charan
మెగాస్టార్ చిరంజీవి కంబ్యాక్ ఫిల్మ్, చిరు 150వ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. చిరు కూడా అభిమానులందరినీ మెప్పించేలా ఉండే కథ కోసం కొద్ది నెలలుగా పలు స్క్రిప్ట్స్ విన్న చిరు ఫైనల్ గా తమిళంలో సూపర్ హిట్ అయిన ‘కత్తి’ సినిమా రీమేక్ నే ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ విషయంపై మరో రెండు రోజుల్లో అధికారిక ప్రకటన కూడా చేయనున్నారని మెగా ఫ్యామిలీ సన్నిహితులు చెప్పారని ఇదివరకే తెలియజేశాం. కానీ ఈ రోజు జరగబోయే రామ్ చరణ్ ‘బ్రూస్ లీ’ ఆడియో లాంచ్ లోనే అనౌన్స్ చేస్తాడని అంటున్నారు.

దాంతో ఈ బ్రూస్ లీ ఆడియో లాంచ్ పై మరిన్ని అంచనాలు, ఆఅసక్థి పెరిగిపోయింది. చెప్పాలంటే చాలా మంది అభిమానుల్లో ఆడియో కంటే చిరు అనౌన్స్ చేయబోయే 150వాక్ ఇనెమా గురించే ఎక్కువ క్రేజ్ కనిపిస్తున్నట్లు సమాచారం. అలాగే చిరంజీవి తన 150వ సినిమా దర్శకత్వ బాధ్యతలు తనకి ‘ఠాగూర్’ తో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన వివి వినాయక్ కి అప్పగించినట్లు సమాచారం. ఈ విషయంపై కూడా క్లారిటీ ఇచ్చే అవాక్షం ఉందని అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. మరి చిరంజీవి అభిమానుల కోరికను తీర్చే తన 150వ సినిమా శుభావార్తని చెబుతాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది. దానికి మరి కొద్ది గంటలు మాత్రమే సమయం ఉంది..

Exit mobile version