
ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా కొత్త దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి రూపొందించిన సినిమా ‘శివమ్’. పండగ చేస్కో లాంటి హిట్ సినిమా తర్వాత రామ్ హీరోగా నటించిన సినిమా కావడంతో మొదట్నుంచీ ఈ సినిమా మంచి అంచనాలు కనిపించాయి. ఇక ఈ అంచనాల నేపథ్యంలోనే నిన్న (అక్టోబర్ 2న) ఈ సినిమా పెద్ద ఎత్తున విడుదలైంది. స్రవంతి రవికిషోర్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా మొదటి షో నుంచే మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఈ సినిమా రన్‌టైమ్ చాలా ఎక్కువైందనే నెగిటివ్ టాక్ ఈ సినిమా విషయంలో బాగా వినిపించింది.
ఇక ఈ నేపథ్యంలోనే శివమ్ యూనిట్ సినిమాకు కొద్దినిమిషాల మేర కత్తెర వేయాలనే ఆలోచన చేసింది. ఈ క్రమంలో దాదాపుగా 20 నిమిషాల నిడివి గల సన్నివేశాలను తొలగించారు. రేపు, ఎల్లుండి నుంచి ఈ ఎడిటెడ్ వర్షన్‌ను ప్రదర్శించనున్నారు. ఇక సినిమాకు మేజర్ మైనస్ పాయింట్‌గా కనిపిస్తోండగా సినిమా యూనిట్ ఈ విషయంలో రిలీజ్ తర్వాత స్టెప్ తీసుకోవడం సినిమాకు కొంతమేర ఉపయోగపడే సూచనలే కనిపిస్తున్నాయి. రామ్ సరసన రాశి ఖన్నా హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు సాంగ్స్, కామెడీ, రామ్ ఎనర్జీ ప్లస్ పాయింట్స్‌గా నిలిచాయి.