జూ. ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ ఎలా నడుస్తోందో తెలుసా..!

janathagarage1
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ‘జూ. ఎన్టీఆర్’ హీరోగా ‘కొరటాల శివ’ తెరకెక్కిస్తున్న చిత్రం ‘జనతా గ్యారేజ్’ పై సినీ వర్గాల్లో, అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇటీవలే విడుదలైన టీజర్ బాగుండటం, గతంలో కొరటాల శివ, మైత్రీ మూవీ మేకర్స్ కాంబోలో వచ్చిన ‘శ్రీమంతుడు’ ఘన విజయం సాధించడం, ఎన్టీఆర్ గత సినిమా ‘నాన్నకు ప్రేమతో’ సూపర్ హిట్ అవడం వంటి కారణాలతో ఈ చిత్రంపై మంచి హైప్ క్రియేట్ అయింది.

ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం తరువాతి షెడ్యూల్ కోసం ఆగష్టు 1 న కేరళ వెళ్లనుంది. అక్కడే ఆగష్టు 10 వరకూ షూటింగ్ జరుపుకొని తరువాత తిరిగి హైదరాబాద్ రానుంది. ఈ షెడ్యూల్లో కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరగనుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యా మీనన్లు హీరోయిన్లుగా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం దర్శకత్వం వహిస్తున్నారు.

Exit mobile version