అఖిల్ రెండవ సినిమా టైటిల్ అదేనా ?


అక్కినేని అభిమానుల దృష్టి మొత్తం అఖిల్ రెండవ సినిమాపైనే ఉంది. మొదటి సినిమా అనుకోని విధంగా ఫ్లాప్ అవడంతో ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని అంతా కోరుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా టైటిల్ ను గెస్ చేయమని అక్కినేని హీరోలు పెడుతున్న క్విజ్ ఇంకా ముగియలేదు. నిన్న నాగార్జున తన ‘నిర్ణయం’ సినిమాలోని ‘హలో గురు ప్రేమ కోసమే’ పాటను చూపి టైటిల్ అందులోనే ఉందని క్లూ ఇవ్వగా ఈరోజు నాగ చైతన్య ‘ఏ మాయ చేసావే’ లోని ‘హో సోన’ పాటను ట్విట్టర్లో పెట్టి ఇందులో ఇంకో క్లూ ఉందన్నారు.

ఈ రెండు క్లూస్ ని బట్టి చూస్తే సినిమా టైటిల్ ‘హలో’ అని అనిపిస్తోంది. సోషల్ మీడియాలో కూడా అదే టైటిల్ అయ్యుంటుందని ఎక్కువ శాతం మంది గెస్ చేస్తున్నారు. మరి టైటిల్ అదేనా కాదో నాగార్జునే తేల్చాలి. విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను నాగార్జున నిర్మిస్తుండగా పి. ఎస్. వినోద్ సినిమాటోగ్రఫీ చేస్తుండగా అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version