మెగాస్టార్ 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ కొన్ని రోజుల క్రితమే రెగ్యులర్ షూట్ ను మొదలుపెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి ముందుగా విడుదలచేసిన సాంకేతిక నిపుణుల జాబితాలో సంగీత దర్శకునిగా ఏ.ఆర్ రెహమాన్ పేరును ప్రకటించారు. కానీ బిజీ ప్రాజెక్ట్స్ వలన ఆ సినిమా చేయలేకపోతున్నానని రెహమాన్ కొద్దిరోజుల క్రితమే వెల్లడించారు. దీంతో అందరిలోనూ ఈ చిరు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ చిత్రానికి సంగీత సారథ్యం ఎవరు వహిస్తారు అనే దానిపై సందిగ్ధం నెలకొంది.
మధ్యలో మోషన్ పోస్టర్ కు నైపత్య సంగీతం అందించిన థమన్ చేస్తారని వార్తలొచ్చినా ఇంకా తనకు పిలుపు రాలేదంటూ ఆయనిచ్చిన క్లారిటీ అవి కాస్త వాస్తవం కాదని తేలిపోయాయి. మళ్ళీ ఇప్పుడు మరొక టాప్ సంగీత దర్శకుడు కీరవాణి పేరు తెర మీదకు వచ్చింది. తాన సంగీతంతో ‘బాహుబలి’ వంటి గొప్ప సినిమాకు వెన్నుదన్నుగా నిలిచిన ఆయనైతేనే ‘సైరా’ కు న్యాయం చేయగలరని చిత్ర టీమ్ భావిస్తోందని, దీనికి సంబందించిన చర్చలు కూడా జరుగుతున్నాయని ఫిల్మ్ నగర్ టాక్.
మరి ఈ వార్త ఎంత వరకు వాస్తవమో, ఒక వేళ వాస్తవమే అయితే కీరవాణి చిరు సినిమాకు పనిచేస్తారో లేదో తెలియాలంటే ఇంకొంత సమయం ఎదురుచూడగా తప్పదు.